పృథ్వీకి ఇచ్చిపడేసిన అవినాష్.. యష్మీకి నామినేషన్ల దెబ్బ!
on Oct 9, 2024
బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ కి దిమ్మతిరిగే నామినేషన్లు పడ్డాయి. అందులో యష్మీ, పృథ్వీలకే ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాత విష్ణుప్రియ, కిర్రాక్ సీతలకి పడ్డాయి. ఇక దీనితో పాటు కొత్తగా వచ్చిన రాయల్ క్లాన్ నుండి మెహబూబ్, గంగవ్వ నామినేషన్లో ఉన్నారు.
నిన్నటి ఎపిసోడ్ లో పృథ్వీని అవినాష్ నామినేట్ చేశాడు. నామినేషన్ గా తన రీజన్ చెప్తూ.. ప్రభావతి టాస్కు.. బెలూన్ టాస్కు తప్ప మీరు ఎక్కడా కనిపించలేదు.. ఆ ప్రభావతి టాస్కులో కూడా అమ్మాయిలతో ఆడారు, అలా ఆడటం నాకు నచ్చలేదని అవినాష్ అన్నాడు. అంటే అమ్మాయిలతో ఆడకూడదా? ఏమైంది అంటూ పృథ్వీ అన్నాడు. అంటే నీ ఇష్టమొచ్చినట్లు అమ్మాయిలను విసిరేశావ్.. వాళ్లకి దెబ్బలు తగిలుంటాయ్ కదా అంటూ అవినాష్ అన్నాడు. దీనికి నాకు కూడా తగిలాయ్ అంటూ వాదించాడు పృథ్వీ. ఏమో బ్రో నాకు నువ్వు కనిపించలేదు.. టాస్కులో తప్ప హౌస్ లో ఎక్కడా కనపడలేదంటూ అవినాష్ అన్నాడు. మరి ఇంకేం చేయాలి చెప్పు బ్రో టాస్కు కాకుండా అంటూ పృథ్వీ వాదించాడు. గేమ్ అంటే టాస్కు మాత్రమే కాదు.. మరి ఎందుకొచ్చావని అవినాష్ అంటే విన్ అవ్వడానికి వచ్చానంటూ పృథ్వీ అన్నాడు. అయితే సరే విన్ అవ్వు అంటూ అవినాష్ అన్నాడు. ఇక తన రెండో నామినేషన్ గా యష్మీని చేశాడు అవినాష్. వేరేవాళ్ళు మణికంఠని నామినేట్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావ్.. ప్రతీవారం అలా నామినేట్ చేయడం నచ్చలేదంటూ తన రీజన్ చెప్పాడు అవినాష్.
ఇక మన పాత కంటెస్టెంట్స్ ని నామినేషన్ చేసాక.. వారికి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ మామ. మీరు రాయల్స్ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులను.. అందరూ కలిసి డిస్కస్ చేసుకొని నామినేట్ చేయాలి.. అయితే నిన్న వారు రెండు షీల్డ్స్ గెలుచుకున్నారు.. వారు నామినేషన్ షీల్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.. ఆ షీల్డ్ ఉన్న వారిని మీరు నామినేట్ చేయాలంటే విన్నర్ ప్రైజ్ మనీ నుంచి లక్ష రూపాయలు కోల్పోతారు కాబట్టి ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకోండి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ఓజీ వాళ్ళంతా కలిసి నయని పావని, అవినాష్, గంగవ్వ, మెహబూబ్ అని అనుకున్నారు. అయితే రాయల్ క్లాన్ వాళ్ళంతా కలిసి నయని పావనికి నామినేషన్స్ షీల్డ్ ఇచ్చారు. ఇక వేరే దారి లేక మెజారిటీ సభ్యులు చెప్పిన మెహబూబ్, గంగవ్వలని ఓజీ కంటెస్టెంట్స్ ఛీఫ్ నబీల్ నామినేషన్ చేశారు. ఇక హౌస్ లో జరిగిన నామినేషన్లో యష్మీకే అత్యధికంగా ఆరు నామినేషన్లు పడ్డాయి.